PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘నారప్ప’ నాకో సవాల్‌..

1 min read

సినిమా డెస్క్​ : విక్టరీ వెంకటేశ్‌ శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో నటించిన ‘నారప్ప’. ఈ చిత్రం ఈ నెల 20న ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన శనివారం ప్రింట్‌, సోషల్‌ మీడియా మాధ్యమాలతో మాట్లాడారు ‘‘రీమేక్‌ సినిమా అంటేనే పెద్ద సవాల్‌ ఎదుర్కోవడానికి సిద్దపడాలి. రెట్టింపు కష్టపడాలి. కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాను. ఏ సినిమాకు పడని కష్టం ‘నారప్ప’ కోసం పడ్డాను. అయితే ఈ కథ విన్నప్పుడు గట్‌ ఫీలింగ్‌ కలిగింది. ఈ పాత్ర పోషించడం సవాల్‌గా అనిపించింది’’ అని అన్నారు..
థియేటర్లు త్వరలోనే తెరుచుకుంటాయి
కరోనా కారణంగా సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తుంది. దీని వల్ల అభిమానులు చాలామంది బాధపడ్డారు. కానీ పరిస్థితులను బట్టి తప్పలేదు. అందుకు అభిమానులకు సారీ చెబుతున్నా. ఇదొక కొత్త అనుభవంగా భావిస్తున్నా. అప్పుడప్పుడు కొత్త మార్పులను స్వాగతించాలి. ఓటీటీ అభివృద్ది చెందడం కూడా మంచి పరిణామమే. కరోనా తగ్గి థియేటర్లు తెరచుకుని పాత రోజులు వస్తాయని ఆశిస్తున్నా.

About Author