NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండ ఎంపీపీగా నారాయణ దాసు

1 min read

పల్లెవెలుగు వెబ్​,పత్తికొండ: పత్తికొండ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి నారాయణదాసు ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీ గా బలరాముడు ఎన్నుకున్నారు. కో ఆప్షన్ మెంబర్గా కారుమంచి నజీర్ ఎన్నుకున్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో ఎన్నికల ప్రత్యేక అధికారి విక్టర్ సమక్షంలో మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పత్తికొండ మండలంలో 20 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉండగా అందులో 16 నియోజకవర్గాలను వైసిపి అభ్యర్థులు. ముగ్గురు టీడీపీ అభ్యర్థులు ఒక సీపీఐ అభ్యర్థి ఎన్నికల్లో గెలుపొందారు. 20 మంది ఎంపీటీసీ ల తో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నిక లాంఛనప్రాయమైన ది. అనంతరం నూతనంగా ఎంపికైన మండల పరిషత్ అధ్యక్షులు నారాయణదాసు మాట్లాడారు వైసీపీ ఎమ్మెల్యే ఆశీస్సులు పోచంరెడ్డి సేవాదళ్ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డి సహకారంతో తనకు ఎంపీ పదవిని కట్టబెట్టినందుకు బాధ్యతతో పని చేస్తానని తెలిపారు. పత్తికొండ మండల అభివృద్ధి కోసం అందరి సహకారంతో పని చేస్తానని చెప్పారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎంపీడీవో పార్థసారధి, వీఆర్వోలు పంచాయతీ సెక్రటరీ సుధాకర్ రామకృష్ణ, న్యాయవాది ఎల్లారెడ్డి పోచంరెడ్డి సేవాదళ్ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డి ఎం పి టి సి సభ్యులు పాల్గొన్నారు.

About Author