NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నారాయణరెడ్డి ఆదిత్యం అమోఘం

1 min read

సర్పంచ్ నారాయణ రెడ్డి కి సాయినాథ్ శర్మ ప్రశంస

పల్లెవెలుగు వెబ్ వీరపనాయుని పల్లె: ఉగాది పార్న పండుగ సందర్బంగా సర్పంచ్ నారాయణ రెడ్డి ఇచ్చిన ఆదిత్యం అమోఘమని కమలాపురం నియోజకవర్గ ప్రజా సేవకుడు తెలుగునాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వైసీపీ నాయకుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ ఆన్నారు. వీరపనాయుని పల్లె మండలం అడవిచెర్లో పల్లె గ్రామానికీ చెందిన సాయినాథ్ శర్మ ఆత్మీయుడు గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి బుధవారం మధ్యాన్నం ఇచ్చిన విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విందుకు సాయినాథ్ శర్మ నియోజక వర్గం లోని ఆయన అభిమానులు నారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గ్రామానికీ విచ్చేసిన సాయినాథ్ శర్మ కు గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి కృష్ణారెడ్డి తదితర గ్రామ నాయకులు స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతిఒక్కరిని సాయినాథ్ శర్మ పేరు పేరునా పలకరించడం తో గ్రామస్థులు ఆయనకు అభిమానులు గా మారారు. నియోజక వర్గం లోని ఆరు మండలాలనుంచి నారాయణా రెడ్డి ఇచ్చిన విందుకు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు విచ్చేయడం తో గ్రామంలో జాతర సందడి నెలకొంది. తన అభిమానులు పిలిచిన ప్రతి ఇంటికి సాయినాథ్ శర్మ వెళ్ళడం తో వారి కుటుంబాలలో ఆనందం నెలకొంది.. ప్రజలతో మమేకమయ్యే సాయినాథ్ శర్మ లాంటి వ్యక్తి ప్రస్తుతం రాజకీయాలకు అవసరమని గ్రామస్థులు చర్చించు కోవడం ప్రథాన విశేషం ఈ సందర్భంగా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ తమను ఎంతో ఆప్యాయంగా విందుకు పిలిచిన నారాయణ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. తమ అభిమానులందరూ కలిసికట్టుగా రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి చేయడానికి పార్లమెంటుకు అవినాష్ రెడ్డిని శాసనసభ్యుడిగా రవీంద్రనాథ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి వ్యక్తి చిత్తశుద్ధి లేకుండా కృషి చేయాలని కోరారు.

About Author