PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నరేంద్ర మోదీ పాలన బ్రిటిష్ పాలనను మించిపోయింది

1 min read

– ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రమాదంలో ఉంది
– ఆర్టికల్ 19 బావ వ్యక్తిగత స్వేచ్ఛను ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసినా, బీజేపీ ప్రభుత్వం
– చలో విజయవాడ జై భారత్ సత్యాగ్రహ సభ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
– కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటరీ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మరియు ఏఐసీసీ సభ్యుడు జె.లక్ష్మీ నరసింహ యాదవ్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : దేశంలో చాలా రకాలుగా సమస్యలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెరుగుదలతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే వాటిపైన మోడీకి ధ్యాసే లేదు కాని రాహుల్ గాంధీకి పేరు ప్రఖ్యాతలు పెరుగుతున్న తరుణంలో ఇలాంటి దారుణాలకు వడిగడుతున్న నరేంద్ర మోడీని దేశ ప్రజల అసహ్యించుకునే స్థితికి దిగజారిపోయారని ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నాలో కేంద్రంలో బిజెపి పాలిత రాష్ట్రాలు అనేక కుంభకోణాలు ప్రశ్నార్ధకమైన లావాదేవీలు జరిగాయన్నారు రక్షణకు సంబంధించి ఆయుధాలు కొనుగోలు అవకతవకలు చోటు చేసుకున్నాయి అవినీతిపై బిజెపి రుణాల ప్రమాణాలతో మాట్లాడుతున్నారని ఇది చరిత్రకు సత్యం కోట్లాదిమంది యువతకు అవసరమయ్యే ఉద్యోగాలను కల్పించడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తు బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు అన్నిటిని ప్రైవేటుపరం చేస్తూ ఆదాని అంబానీ లాంటివారికి దేశ సంపదను దోచి పెడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు ఒక రైతు 30 వేల రూపాయలు అప్పు ఉంటే చెల్లించకపోతే తన ఇల్లు సామాన్లు జప్తు చేసే పరిస్థితి ఏర్పడింది వేలకోట్ల రూపాయలు అప్పులు తీసుకొని దేశాన్ని విడిచిపోతున్న వాళ్లను బిజెపి ప్రభుత్వం ఏం చేయలేకపోగా వారికి వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసం ఇవాళ వారం క్రితం ఆదానికి అంబానికి 20వేల కోట్ల రూపాయలు ఎస్బిఐ నుంచి మాఫీ చేసింది బిజెపి ప్రభుత్వం కాదా మరి ఇలాంటివన్నీ పార్లమెంట్లో ప్రశ్నిస్తున్నారని రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ నుంచి తప్పంచడాని ప్రజాసామానికి గొడ్డలి వేటు కదా అని ప్రశ్నించారు దేశంలో 2024 లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దేశ ప్రజలు సాగానంపడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు త్వరలో నరేంద్ర మోడీ మీద ఈ దేశంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసినందుకు నిరుద్యోగుల తరఫున ప్రభుత్వ ఉద్యోగుల తరపున పరువు నష్ట ధావ వేస్తామని లక్ష్మీ నరసింహ యాదవ్ గారు తెలియజేశారు అలాగే ఈ నెల 24వ తేదీన జరిగే చలో విజయవాడ జై భారత్ సత్యాగ్రహ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, నంద్యాల బీసీ సెల్ అధ్యక్షులు సంపంగి రామకృష్ణ , నంద్యాల పట్టణ ఉపాధ్యక్షుడు ఆనందరావు , జిల్లా ట్రెజరీ ఎస్ వై డి ప్రసాద్ , ఆళ్లగడ్డ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సంజీవ కుమార్ మరియు మిగతా నాయకులు పాల్గొన్నారు.

About Author