ధూళిపాళ్ల నరేంద్ర విడుదల
1 min readపల్లెవెలుగు వెబ్: సంగం డెయిరీ చైర్మన్, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర , సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. సంగం డెయిరీ కేసులో అరెస్టయిన వీరిద్దరికి హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. 4 వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని.. నివాసం ఉంటున్న ఇంటి అడ్రస్ విచారణ అధికారికి ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. విచారణకు 24 గంటల ముందు విచారణాధికారి నోటీసు ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.