NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న‌రేశ్ మాజీ భార్య‌.. కోట్ల రూపాయ‌ల అక్ర‌మ వ‌సూళ్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ న‌టుడు వీకే. నరేశ్‌ మాజీ భార్య రమ్య కోట్ల రూపాయ‌లు అక్ర‌మ వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఈమేర‌కు ర‌మ్య పై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె అయిన రమ్యను ఎనిమిదేళ్ల క్రితం నరేశ్‌ పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం పలు కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. నరేశ్‌ పేరు చెప్పి అధిక వడ్డీ ఆశ చూపి రమ్య కొందరి దగ్గర డబ్బు తీసుకుందని, రిజిస్ట్రేషన్ల పేరు చెప్పి మరి కొందరి దగ్గర వసూలు చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓ కేంద్ర‌ పభుత్వ ఉద్యోగి దగ్గర రూ.45 లక్షలు ఆమె తీసుకొన్నారట. ఇప్పుడామె సమాధానం చెప్పడం లేదని, ఆమె ఇచ్చిన చెక్కు బౌన్స్‌ కావడంతో బాధితులు అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించారు. దాదాపు ఆమె ఏడెనిమిది కోట్లు బయట వసూలు చేసిందని సమాచారం.

                                      

About Author