PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘‘ఎంబీబీఎస్​’’ సీటు సాధించిన నర్మదాకు ఆర్థిక చేయుత

1 min read

పల్లెవెలుగు వెబ్ తెలంగాణా: శ్రీరంగాపూర్ మండల కేంద్రానికి చెందిన దేవని మన్యం కూతురు నర్మదాకు ఇటీవల MBBS సీటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాల (మహబూబాబాద్) లో రావడం జరిగింది. ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నర్మదను శాలువాతో సన్మానించడం జరిగింది. అలాగే ఆమెకు పదివేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ… నర్మదకు అన్నివేళలా సహాయ సహకారాలు ఉంటాయని ఏ అవసరమైన తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో మూడు మెడికల్ కళాశాలలు మాత్రమే ఉండేవని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాలను కెసిఆర్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈరోజు ఒక్క రోజే  రాష్ట్రవ్యాప్తంగా  ముఖ్యమంత్రి 9 నూతన మెడికల్ కళాశాలను ప్రారంభించడం జరిగిందన్నారు. నర్మద మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వం పేదవారి కోసమే మెడికల్ కళాశాలలను అందుబాటులోకి తీసుకు వచ్చిందని, కెసిఆర్ ప్రభుత్వం ఇన్ని మెడికల్ కళాశాలలు అందుబాటులోకి తీసుకురావడం వల్లనే ఈ రోజు నాలాంటి పేదవారికి ప్రభుత్వ మెడికల్ సీటు రావడం జరిగిందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్. గాయత్రి పృథ్వీరాజ్, సర్పంచ్ వినిలరాణి కురుమయ్య, ఉపసర్పంచ్ చీర్ల శివసాగర్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు సయ్యద్, పరశురాం యాదవ్, దెవని మన్యం, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author