జాతీయ అవార్డును అందుకున్న ఉపాధ్యాయిని కళ్యాణి కుమారి
1 min readపల్లెవెలుగు న్యూస్ పత్తికొండ: ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా పత్తికొండ మండలం JM తండా పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న కళ్యాణి కుమారి మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ వారి జాతీయ అవార్డును అందుకున్నారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు మాక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ వారు అందజేసే జాతీయ అంతర్జాతీయ 2023 అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగింది. అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి మాజీ కేంద్ర వ్యవసాయ సహాయ శాఖ మంత్రి వర్యులు సముద్రాల వేణుగోపాలచారి, తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులభరణం కృష్ణ మోహన్ రావు చేతులమీదుగా ఉపాధ్యాయిని కళ్యాణి కుమారి గారికి శాలువా కప్పి మెమొంటోను ని అందజేశారు.ఈ సందర్భంగా మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు వ్యవస్థాపకులు డాక్టర్ సుజాత భట్ల మాట్లాడుతూ, పత్తికొండ మండలం JM తాండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులు లేక పాఠశాలను మూసివేసే స్థితి నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు స్కూల్ కు వచ్చే విధంగా మార్పు తీసుకొచ్చిన ఉపాధ్యాయురాలు కళ్యాణి కుమారి అని ప్రశంసించారు.