NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు.. ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రక‌టించింది. దేశ‌వ్యాప్తంగా 44 మందికి ఉత్తమ ఉపాధ్యాయుల‌ను పుర‌స్కారాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల‌కు తెలుగు రాష్ట్రాల నుంచి న‌లుగురు ఎంపిక‌య్యారు. తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి న‌లుగురిని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల‌ను ఎంపిక చేశారు. తెలంగాణ‌లోని ఆసిఫాబాద్ జిల్లా ఎంపీపీఎస్ సావ‌ర్ ఖేడ్ యాక్టింగ్ హెచ్ఎం రంగ‌య్య‌, సిద్ధిపేట ఇందిరాన‌గ‌ర్ జ‌డ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ రామ‌స్వామి ఎంపిక‌య్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ లింగ‌రాజుపాలెం హైస్కూల్ ఉపాధ్యాయుడు భూష‌ణ్ శ్రీధ‌ర్, చిత్తూరు ఐరాల పాయిప‌ల్లి హైస్కూల్ ఉపాధ్యాయుడు మునిరెడ్డిని అవార్డుకు ఎంపిక చేశారు.

About Author