జాతీయ స్థాయి చిల్ర్డన్స్ ఫెస్టివల్లో ..‘టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ’ ప్రతిభ
1 min readఅభినందించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు
కర్నూలు: పంజాబ్ లో జరిగిన జాతీయ స్థాయి చిల్డ్రన్స్ ఫెస్టివల్ లో ప్రతిభ కనబరిచిన టిజివీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చిన్నారులను తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు అభినందించారు. ఈ కార్యక్రమంలో టిజివి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు భార్గవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పంజాబ్లో జరిగిన జాతీయస్థాయి చిల్డ్రన్స్ ఫెస్టివల్ లో టీజీవి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చిన్నారులు ప్రతిభ కనబరచడం అభినంద నియమని తెలిపారు. అకాడమీ చిన్నారులు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలలో పాల్గొని ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం టి జి వి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు భార్గవ్ కుమార్ మాట్లాడుతూ పంజాబ్ లో జరిగిన జాతీయస్థాయి చిల్డ్రన్స్ ఫెస్టివల్ పోటీల్లో తమ అకాడమీకు చెందిన 19 చిన్నారులకు గాను నలుగురు చిన్నారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని చెప్పారు. తమ అకాడమీకు చెందిన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలలోనే కాక లాంగ్వేజ్ ఎక్స్చేంజ్, కల్చరల్ ఎక్స్చేంజ్ తదితర అంశాలలో ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ పేరును జాతీయస్థాయిలో నిలిపారని తెలిపారు. టీజీవి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించి తమను ప్రోత్సహిస్తున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ అకాడమీ చిన్నారులు భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.