ఆగడాల లంకలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ..
1 min read
ఆరోగ్య సమస్యలపై సిబ్బందికి సహకరిస్తున్న ప్రజలు.. డాక్టర్ : శ్రీ లక్ష్మి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండల పరిధిలో గల ఆగడాల లంక గ్రామంలో సిగ్మా రీసెర్చ్ కన్సల్టెన్సీ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేయడం జరుగుతుందని. ఆరోగ్య వైద్యులు డాక్టర్ శ్రీలక్ష్మి అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సంస్థ ఐదేళ్ల కు ఒకసారి గడపగడపకు వెళ్లి ఇలా సర్వేను నిర్వహిస్తారని తెలిపారు. ఈ సర్వే ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సిగ్మా సూపర్వైజర్ గొల్లి రాజేష్ , ఎం ఎల్ హెచ్ పి, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.