కార్యాలయాల్లో రెప రెపలాడిన జాతీయ జెండా
1 min read-విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు బహుమతుల ప్రధానం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఉదయం ఘనంగా జరిగాయి. తహసిల్దార్ కార్యాలయంలో ఏ ఎస్ఐ సుబ్బయ్య మరియు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం చేసిన అనంతరం డిప్యూటీ తహసిల్దార్ షాన్వాజ్ జాతీయ జెండాను ఎగురవేశారు.మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ,ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి జెండా ఎగురవేసిన అనంతరం కార్యాలయంలో జాతిపిత గాంధీజీ విగ్రహానికి ఎంపీపీ మరియు ఎంపీడీవో పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ జగన్ మోహన్,మోడల్ పాఠశాలలో ఉప సర్పంచ్ తువ్వా లోకేశ్వర రెడ్డి,ప్రిన్సిపాల్ సలీం భాష, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఎస్ఓ విజయలక్ష్మి,జిల్లా పరిషత్ పాఠశాలలో సాయితిమ్మయ్య, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు.అంతేకాకుండా జిల్లా మరియు మండల పరిషత్ పాఠశాలల్లో జెండాను ఎగురవేసిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.వివిధ గ్రామ పంచాయి తీల్లో గ్రామాల సర్పంచులు మరియు పంచాయితీ కార్యదర్శులు జెండాను ఎగరవేశారు.ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు పెద్దమౌలా,ఏఓ సురేష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్లు రాంభూపాల్ రెడ్డి,సురేష్ కుమార్,ఆర్ఐ భాష,ఏపీఓ జయంతి,వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.