తూ తూ మంత్రంగా పేరుకోసమే నేషనల్ హైవే నోటిసులు..!
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం : నెలరోజులు అవుతున్న అధికారులు నిద్ర పోతున్నారా లేక కాసులకోసమేనా ఈ నోటీసులు ,, నంద్యాల జిల్లా. పాణ్యం. ఆర్ అండ్ బి, నేషనల్ హైవే-40. పాణ్యం గ్రామం లో రహదారి కి ఇరువైపులా రాత్రికి రాత్రి బంకులు ఏర్పాటు చేసుకుంటున్న వైనం. ప్రమాదం అని తెలిసినా బ్రతుకు తెరువు కోసం పాట్లు పడుతున్నారు. పాణ్యం నాలుగు రస్తాలా కూడలిలో వ్యాపార నిమిత్తం ఏర్పాట్లు చేసుకున్నారు. హైవే పెట్రోలింగ్ అధికారులకు మరియు పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా ప్రయోజనం మాత్రం శూన్యం.నోటుసులు షాప్ లకు పరిమితం .వారికి జీవనం కల్పించే భాద్యత ప్రభుత్వానిదే.గత వారం రోజులనుండి ఒకరి కొకరు స్థలం కొరకు కొట్టుకోవటం జరిగింది. జాతీయ రహదారి అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. వారు రహదారిలో భూములు కోల్పోయిన వారికీ గ్రామం నందు కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చట్టం లో కనబరచి ఉంది. కానిటోల్ గేట్ లో రుసుము మాత్రం ఠoఛన్ గా వాసులు చేస్తున్నారు. పొరపాటున షాపులు వేసుకున్న పేదప్రజలకు ఏమైనా జరగరానిది జరిగితే తగిన మూల్యం హైవే వారు చెల్లించుకోక తప్పదు. అని గత నెలలు గా చెపుతున్న. అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ .ఏఐఎఫ్ బీ. సిపిఎం. సిపిఐ సిఐటియు . సంఘాలు స్పందనలో కలెక్టర్ కి అధికారుల నిర్లక్ష్యంపై అర్జీ ఇస్తున్నట్టు తెలిపారు.