NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిత్రలేఖనం పోటీలో..జాతీయ స్థాయి అవార్డు

1 min read

పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: చోడవరం చిత్రకళా నిలయం ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విజేతలకు నవంబరు 6వ తేదీన ఆదివారం విశాఖపట్నం అనకాపల్లి జిల్లా చోడవరంలోనీ ప్రేమ సమాజం ఆవరణలో ఎమ్మెల్యే , ప్రభుత్వ చీఫ్ విప్ కరణం ధర్మశ్రీ , అనకాపల్లి ఎంపీ బీసెట్టి వెంకట సత్యవతి లు బహుమతులు అందజేశారు.చిత్ర కళా నిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలు, ప్రదర్శన లో నందికొట్కూరు చిత్రకారులు గీసిన చిత్రాలు బహుమతులు సాధించాయి.నందికొట్కూరు పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు ను గ్రేట్ ఆర్టిస్ట్ అవార్డు, మెమెంటో తో సత్కరించారు.పలువురు చిత్రకారులకు సర్టిఫికెట్ అందజేశారు.శ్రీను ఆర్ట్స్ అకాడమీ చిన్నారులు ఈ పోటీలలో బంగారు పథకాలు సాధించారు .కార్యక్రమంలో పారెస్ట్ రేంజర్ రామ్ నరేష్ , సీనియర్ చిత్రకారులు శర్మ, డాక్టర్ ఆశీర్వాదం , నిర్వాహకులు బొడ్డేటి సూర్యనారాయణ , తదితరులు పాల్గొన్నారు.

About Author