PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిసెంబర్ 12న జాతీయ లోక్  అదాలత్ కార్యక్రమం..

1 min read

రాజీ పడు క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలు, మనోవర్తి, గృహహింస లోక్ అదాలతో ద్వారా రాజీ చేసుకోవచ్చు

జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : చింతలపూడి కోర్టు లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామనీ చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జాతీయ లోక్ అదాలత్ లో బ్యాంక్ కేసులు, రాజీ పడు క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, మనోవర్తి కేసులు, గృహ హింస కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రోనోట్ కేసులు, ఎక్సైజ్ కేసులు,  ప్రీ లిటిగేషన్ కేసులు గా బ్యాంక్ బకాయి కేసులు, టెలిఫోన్ బకాయి కేసులు రాజీ చేసుకోవచ్చని, రాజీ చేసుకొనుట వల్ల విలువైన సమయాన్ని, డబ్బు ఆదా చేసుకోవచ్చు అని, సివిల్ కేసులలో  కోర్టు కు కట్టిన కోర్టు ఫీజు తిరిగి తీసుకోవచ్చని, అలాగే ప్రతి రోజు కోర్టు లో జరుగు ప్రీ లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు. కక్షిదారులు పోలీస్ వారిని, న్యాయవాదులను, కోర్టు సిబ్బంది నీ  కేసుల రాజీ కోసం సంప్రదించాలని తెలిపారు.

About Author