శ్రీ రాజరాజేశ్వరి పాఠశాలలో నేషనల్ న్యూట్రిషన్ వీక్
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : శ్రీ రాజరాజేశ్వరి పాఠశాలలో నేషనల్ న్యూట్రిషన్ వీక్ కార్యక్రమములో భాగంగా గురువారం నాడు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు పాఠశాల కరస్పాండెంట్ ఎం రామేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్ వర్క్స్ సెమినార్స్ విద్యార్థుల ప్రతిభ పాటవాలను పరిశీలించారు . విద్యార్థులు ప్రస్తుతం సమాజంలో పౌష్టికాహారం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్టు. హెచ్ఎం తెలిపారు శారీరక, మానసిక ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో ముఖ్యం. ఏం తింటున్నామో దాని పోషక విలువ ఏమిటన్నది చాలామందికి అవగాహన లేదని ప్రజలు పౌష్టికాహారం మరియు అనుకూలమైన ఆహారపు అలవాట్ల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సమయానుకూలత అవసరం అనీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఆకుకూరను ఒక్కొక్క పండును తినడం వల్ల వచ్చే పౌష్టికాహారం వివరాలను వివరించారు ముఖ్యంగా సపోటా పండ్లు, కమలాఫలాలు, క్యారెట్, ఆపిల్, దానిమ్మ రసం ఆవాలు, వాము, అల్లం, కీరదోస, మునగాకు, ద్రాక్ష, బీట్రూట్, కరివేపాకు, నేరేడు, గుమ్మడికాయ, జామ అనే అంశాలు తీసుకొని విద్యార్థులు వాటి ప్రాముఖ్యతను తెలిపి అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీ ఎం. రామేశ్వర రావు , ఏ. డి . ఎం. బి.ఎన్. రాఘవేంద్ర రావు , ఎం. నాగకృష్ణ కాంత్ ,సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.