PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ రహదారి భద్రత వార్షికోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ధన్వంతరి హాల్లో నిర్వహించిన జాతీయ రహదారి భద్రత వార్షికోత్సవానికి వైద్య సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణాశాఖ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు-2023 ద్వారా ఈ నెల 18 జనవరి 2023 నుండి 24 జనవరి 2023 వరకు ‘స్వచ్ఛత పక్వాడ – 2023 కార్యక్రమం ను నిర్వహిస్తామని తెలియజేశారు. “స్వచ్ఛత పఖవాడా – 2023″మంచి సమరయుడు (గుడ్ సమరిటన్) గా ఎక్సిడెంట్ బాధితులకు సహాయం అందించుదాం – ప్రాణాలు కాపాడుదాం అని కర్నూల్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.రోడ్డు ప్రమాదం జరిగిన గంట (గోల్డెన్ అవర్) లోపు బాధితులకు సరైన వైద్య చికిత్స అందించితే వారి ప్రాణాలు కాపాడవచ్చు అని తెలిపారు. ” గుడ్ మారిన్ “: రహదారి ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు నిస్వార్థంగా, స్వచ్ఛందంగా సహాయం అందించి, దగ్గరలోని హాస్పిటల్కు చేర్చేవారు.1-10బాధితునికి సహాయపడుటMV చట్టం, 1988 6Sec 134A, CMV Rules 168 169 ల ద్వారా చట్టబద్ధమైన రక్షణ “గుడ్ సమరిటన్” లకు పోలీస్ నుండి ఇబ్బందులుఉండవు, మరియు ఎటువంటి సివిల్, క్రిమినల్ చర్యలు మీ పై ఉండవు,అని కర్నూలు ఆర్టీవో గారు తెలిపారు.రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి వచ్చి వారికి చికిత్స అందించడానికి సహాయపడాలని విజ్ఞప్తి చేశారు.ఇలా చేయడం వలన డెత్ రేటు తగ్గుతుందని, మనం ఒకరికి సహాయం చేసినట్లు వారైతే మని అని తెలియజేశారు.మీరు ఎవరైనా పేషెంట్ కి హాస్పిటల్ కి తీసుకొని వస్తే ఎటువంటి హాస్పిటల్ బిల్లులు మరియు మందుల ఖర్చులు చెల్లించనవసరం లేదు. మీరు వారికి సహాయం చేసి వారి ప్రాణాలు కాపాడిన వారైతారని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి కర్నూలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, శ్రీ. కంతేటి శ్రీధర్, కర్నూల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, శ్రీ.రవీంద్ర కుమార్, కర్నూలు ఆర్టీవో, శ్రీ.రమేష్, మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నరు.

About Author