జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు…
1 min readవిద్యార్థిని, విద్యార్థులు రోడ్డు భద్రత నియమ నిబంధనలు తెలుసుకోవడం పాటించడం ముఖ్యం..
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి నాగ మురళి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : నూజివీడు 1చదువుతో పాటూ రహదారి భద్రత నియమాలను తెలుసుకోవడం ప్రతి విద్యార్థికి ఎంతో ముఖ్యమని మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ జి. నాగ మురళి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం నూజివీడు సెయింట్ థోమస్ పాఠశాల విద్యార్థులకు రహదారి భద్రతపై అవగహన కల్పించారు. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు క్యూ పద్ధతిని పాటించడం వలన కిందపడి గాయాలు పాలుకాకుండా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమములో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ జి. నాగ మురళి, ప్రిన్సిపల్ చిన్నపు రెడ్డి, ఆర్టీసీ డిఎమ్, పవన్ కుమార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.