PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రిమిసంహారక వ్యవసాయం  కంటే -ప్రకృతి వ్యవసాయం మిన్న

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు: క్రిమి సంహారక వ్యవసాయ కంటే ప్రకృతి వ్యవసాయం మిన్న అని ఏపీ సీఎన్ ఎఫ్ సిబ్బంది పి ఆర్ పి మేరీ తెలిపారు, శనివారం  మండలంలోని బయనపల్లి గ్రామం మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్రిమి సంహార మందులు లేని ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయాలి, దీని ద్వారా ఎలాంటి లాభాలు ఉంటాయి, రైతులు పంటలకు  సంబంధించిన  ఏ ఏ పద్ధతులు అవలంబించాలి వంటి విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది, బయనపల్లి కి చెందిన సాలమ్మ అనే మహిళా రైతు పొలంలో ఏర్పాటు చేసిన ఏటీఎం  మోడల్ ప్రకృతి వ్యవసాయం,  సునీత అనే మహిళా రైతు పొలంలోవేసిన ఏ- గ్రేడ్ ప్రకృతి వ్యవసాయపంటలను ఏపీ సీఎన్ ఎఫ్ పిఆర్పి మేరీ, యూనిట్ ఇంచార్జి వెంకటయ్య ఆధ్వర్యంలో  క్షేత్ర సందర్శన కార్యక్రమంలో భాగంగా,అగ్రికల్చర్ అధికారిణి  శ్రీదేవి,ఎపియం గంగాధర్ మండల సమాఖ్య ఒ.బిలు శివనాగలక్ష్మీ, కమలమ్మ లు సదర్శించడం జరిగింది, ఈ సందర్భంగా వారు   మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం ముందుకెల్లే ప్రక్రియలో భాగంగా క్రిమి సంహారక మందులు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులు , కాషాయాల ద్వార వేసిన ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, దుంప జాతి,కి చెందిన పంటలు (వంగ, బెండ,గోంగూర,మిరప టొమోటో, కొత్తిమీర, పాలకూర, తోట కూర, చిక్కుడు,గోరుచిక్కుడు,కాకర, మెంతికుర, బంగాళాదుంప, క్యారెట్, ముల్లంగి,బంతి పూలు) పంటలు వేసి,నిత్యం రైతుకు15 రోజుల నుండి 365 రోజులు ఆదాయం వచ్చే లాగా ఏటీఎం, A గ్రేడ్ మోడల్ పంటలు వేయడం చాల బాగుందని రైతులకు సూచించడం జరిగింది, అలాగే తెగుళ్లు, చీడలు,రాకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలో అగ్రికల్చర్ అధికారి శ్రీదేవి తెలిపారు, దీనిపై రైతులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది,ప్రకృతి వ్యవసాయం చేసే మహిళా రైతులకు అన్ని విధాలుగా ఆర్థికంగా అండగా ఉంటామని ఎపియం గంగాధర్ తెలిపారు, ఈ కార్యక్రమం లో APCNF సిబ్బంది, రైతులు పాల్గొనడం జరిగింది.

About Author