నాటుసారా పై అవగాహన సదస్సు…
1 min read
న్యూస్ నేడు, కర్నూలు: ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల ఓర్వకల్లు మండలంలో నవోదయం కార్యక్రమంలో భాగంగా నాటుసారా అవగాహన సదస్సు నిర్వహించి నాటు సారా రహిత గ్రామంగా ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలని తదుపరి నాటు సారా తయారు చేయడం అమ్మడం మరియు రవాణా చేయడం నేరమని తెలిపి,నాటు సారాను పూర్తిగా మానివేస్తామని గ్రామ పెద్దలు మహిళా పోలీసులు మరియు రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం గ్రామంలో ఓర్వకల్లు గ్రామంలో నాటుసారపై పాత కేసులున్న వారందరినీ సుమారు 8 మంది పైన బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగినది.వీరు చర్యలు ఉల్లంఘించినట్లయితే వీరికి లక్ష రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపి తదుపరి చర్యకు ఉపక్రమించడం జరుగుతుందని హెచ్చరించడమైనది
బైండ్ ఓవర్ కేసు వివరములు
1)ఎన్ఎస్ గంగారాం ఓర్వకల్లు , 2)ఎన్ఎస్ విజయ్ ఓర్వకల్లు , 3)కే మద్దయ్య మీది వేముల ,4)నీలి షికారి సుశీల ఓర్వకల్లు
5)ఎన్ఎస్ గాయత్రి , ఓర్వకల్లు 6)ఎన్ఎస్ శైలు ఓర్వకల్లు 7)ఎంఎస్ రాజమ్మ ఓర్వకల్లు మరియు 8)ఎరుకలి విజయ్,సంతోష్ నగర్,కర్నూలు మొత్తం ఎనిమిది మందిని ముందస్తుగా బైండోవర్ నమోదు చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎస్సై రెహనా వేగం మరియు సిబ్బంది శేషారెడ్డి, ఈరన్న రామచంద్రుడు,మధు పాల్గొన్నారు.