NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న‌ల్ల జెండా ఎగుర‌వేసిన న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ..?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ‌పెట్టిన వ్యవ‌సాయ చ‌ట్టాల‌ని వెన‌క్కి తీసుకోవాల‌ని దేశ వ్యాప్తంగా రైతులు నిర‌సన‌లు చేప‌ట్టి ఆరునెల‌లు పూర్తయింది. ఈ సంద‌ర్భంగా రైతులు బుధ‌వారం బ్లాక్ డే పాటిస్తున్నారు. బ్లాక్ డే సంద‌ర్భంగా న‌ల్ల జెండాలు ఎగుర‌వేసి నిర‌స‌న తెల‌పాల‌ని కిసాన్ సంయుక్త మోర్చా పిలుపునిచ్చింది. బుధ‌వారం బుద్ధపూర్ణిమ‌. స‌మాజంలో స‌త్యం, అహింస‌లు క‌రువ‌వుతున్నాయి. ప్రధాన విలువ‌లు పున‌రుద్ధర‌ణ జ‌రిగేలా పండుగ జ‌రుపుకోవాల‌ని కిసాన్ సంయుక్త మోర్చ పిలుపునిచ్చింది. కిసాన్ సంయుక్త మోర్చ పిలుపు మేర‌కు మాజీ క్రికెట‌ర్, కాంగ్రెస్ నేత న‌వజ్యోత్ సింగ్ సిద్ధూ పాటియాల లోని త‌న ఇంటి మీద న‌ల్లజెండా ఎగుర‌వేసారు.

About Author