వైభవంగా… అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలు..
1 min readఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
ఆలయ అభివృద్ధికి ఘంటా కోటేశ్వరరావు, అచ్చమ్మ దంపతులు సహకారం అభినందనీయం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలోని దెందు లూరు మండలం గాలాయి గూడెంలో కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, సంతాన లక్ష్మి గా పేరుపొందిన గాలాయ గూడెం గ్రామ దేవత శ్రీ అచ్చమ్మ పేరంటా లమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. దెందులూరు శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి, నూజివీడు డిఎస్పి మురళీకృష్ణలు ఉత్సవాలను శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. గాలాయ గూడెం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త, దాత మణికంఠ కన్స్ట్రక్షన్ అధినేత గంటా కోటేశ్వరరావు , అచ్చమ్మ దంపతులు , గంటా సుబ్బారావుల సహకారంతో నూతనంగా నిర్మించిన రోడ్డును ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. పేరంటాలమ్మ తల్లికి ఆలయ కమిటీ సభ్యులు పసుపు, కుంకుమ, సారే బోనాలు సమర్పించి రకరకాల పుష్పాలతో అమ్మవారిని సిద్ధం చేసి భారీ విద్యుత్ అలంకరణ సెట్టింగులతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుoటరన్నరు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, డిఎస్పి మురళీకృష్ణ. పలువురు ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిమంది దర్శనానికి అమ్మవారిని వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకోవడంతో ప్రశాంతంగా మొదటి రోజు దర్శనాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి తన నియోజవర్గంలో ఉండడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ,ఉత్సవాలకు సుమారు కోటి రూపాయల ఖర్చు చేసేమని భవిష్యత్తులో అవసరమైన మరిన్ని సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. భక్తులు వేల సంఖ్యలో పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుoటరన్నరు. అచ్చమ్మ పేరంటాల తల్లి ఆలయ అభివృద్ధిలో భాగంగా శివాలయం ముందు ఆడిటోరియం మరియు నూతన రోడ్డు నిర్మించిన శ్రీ మణికంఠ కన్స్ట్రక్షన్స్ అధినేత గంట కోటేశ్వరరావు అచ్చమ్మ దంపతులు కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గాలాయగూడెం శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవ కమిటీ గట్టి బందోబస్తుతో ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ సిబ్బంది ఆలయ కమిటీ సభ్యులకు నవరాత్రి తొమ్మిది రోజులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దానితో పాటు 15 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిఅన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఎక్కడ ఏ విధమైన చర్యలు కు తావు లేకుండా ఉత్సవాలు అంగరంగ వైభవంగా కనులు పండుగ కొనసాగుతున్నాయి అన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ చిలకా సుబ్బారావు, జడ్పీటీసీ నిట్ఠా లీలా నవకాంతం, అలయ కమిటీ సభ్యులు, వైకాపా నేతలు పోకల రాంబాబు, గ్రామపెద్దలు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు, పాల్గొన్నారు.