NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిక్కుల్లో న‌య‌న‌తార దంపతులు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: సరోగసీ (అద్దె గర్భం) ద్వారా ఇద్దరు మగపిల్లలకు తల్లిదండ్రులైన నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ దంపతులు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. వారికి వివాహమై నాలుగు నెలలే అయింది. ఇంతలోనే సరోగసీ ద్వారా వాళ్లు కవల పిల్లలకు జన్మ ఇవ్వడంతో వివాదం మొదలైంది. సోషల్‌ మీడియా వేదికగా రకరకాల కామెంట్స్‌ వచ్చాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘నయనతార దంపతులు నిజంగానే సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చారా? ఇందులో నిబంధనల ఉల్లంఘన ఉందా? దానిపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి’ అనే విషయాలపై మెడికల్‌ డైరెక్టరేట్‌ ద్వారా వివరణ తీసుకుంటామని పేర్కొన్నారు.

                                    

About Author