PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్యన్​ఖాన్​కు ఎన్​సీబీ కస్టడీ మరోవారం పొడగింపు!

1 min read

పల్లెవెలుగువెబ్​, ముంబయి: డ్రగ్స్​​ వ్యవహారంలో పట్టుబడ్డ ప్రముఖ బాలివుడ్​ హీరో షారూక్​ తనయుడు ఆర్యన్​ఖాన్​కు ఎన్​సీబీ కస్టడీని 7వ తేదీ దాకా పొడగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే విచారిస్తోన్న నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో అధికారులు పలు కీలక ఆధారాల మేరకు మరికొద్దిరోజులు ఆర్యన్​ను ప్రశ్నించేందుకు ఈనెల 11వ వరకు కస్టడీని పొడగించాలని కోర్టుకు నివేదించారు. దీంతో మరోవారంపాటు ఆర్యన్​ ఎన్​సీబీ కస్టడిలోనే ఉండే అవకాశం ఉంది. ఈనెల 3న ముంబయి నుంచి గోవా వెళుతోన్న కార్డిలియా క్రూయిజ్​ లైనర్​ అనే భారీ నౌకలో జరుగుతోన్న రేవ్​పార్టీపై ఎన్​సీబీ అధికారులు దాడి చేసి డ్రగ్స్​​ వినియోగిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకుని భారీఎత్తున డ్రగ్స్​​ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పట్టుబడ్డ వారిలో షారూక్​ తనయుడు ఆర్యన్​ ఉండడం తీవ్ర కలకలం రేపింది. ఎన్​సీబీ విచారణలో ఆర్యన్​ నుంచి కొంత కీలక సమాచారం రాబట్టింది. ఈ క్రమంలో ఆర్యన్​కు ఎన్​సీబీ కస్టడీ పొడగించినట్టు తెలుస్తోంది.

About Author