PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాట తప్పి మడమ తిప్పి విద్యుత్ చార్జీలు పెంచిన జగన్ రెడ్డి  

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని  లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజలను చైతన్య పరిచి ప్రజాగ్రహ ఉద్యమం చేపడతామని బీజేపీ పత్తికొండ అసెంబ్లీ కన్వీనర్ రంజిత్ కర్ణి హెచ్చరించారు.మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం, పత్తికొండ మండల కేంద్రం స్థానిక నాలుగు స్తంభాల మంటపం వద్ధ బిజెపి రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని ధర్నా నిర్వహించారు. పత్తికొండ అసెంబ్లీ కన్వీనర్ రంజిత్ కర్ణి గారి అద్యక్షతన బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు పోలంకి రామస్వామి గారి అద్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రజలకు పెనుభారంగా మారాయని, అందులో భాగంగా విధ్యుత్ చార్జీల పెంపు పై బీజేపీ నిరసన తెలుపుతూ, తేరు బజార్ దగ్గర నుంచి నాలుగు స్థాంబాల కూడలి వరకు ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టారు. అనంతరం స్థానిక తహసిల్దార్ విష్ణు ప్రసాద్ కు అలాగే కరెంటు ఆఫీస్ నందు ADEకి వినతి పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా పోలంకి రామస్వామి మరియు రంజిత్ కర్ణి మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని  ప్రతి సభలో చెప్పిన మాటలు నేటికి ప్రజల చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయన్నారు. కాని నేడు అందుకు పూర్తి విరుద్దంగా సియం జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పి ప్రభుత్వం ఏర్పడిన  నాలుగున్నరేళ్ల కాలంలో  ఏకంగా 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై బారం మోపుతూనే ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున జగన్ రెడ్డి  కరెంటు చార్జీలు పెంచమని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు గురించి ప్రవచనాలు చెప్పారు, కాని నేడు అవన్నీ అబద్ధాలని నిరూపించారన్నారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఏ ఒక్క రోజు సక్రమంగా విద్యుత్ సరఫరా కాలేదని, కానీ కరెంటు బిల్లుల మోత మాత్రం మోగుతుందన్నారు. ప్రభుత్వం వివిధ రూపాలలో విధ్యుత్ చార్జీలు పెంచుతూ ప్రజల పై సుమారు 57 వేల కోట్ల రుపాయిల భారం మోపిందని తెలిపారు. అంతేకాక  8 సార్లు విద్యుత్ టారీఫ్ లను సైతం మార్చారని అన్నారు.  ట్రూ అప్ మరియు ఇంధన సర్ చార్జీల రూపంలో ప్రజల పై సుమారు 50 శాతం పైగా విధ్యుత్ బిల్లులలో అదనపు భారం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రతి నెల బిల్లు జెనెరేట్ చేయడంలో జాప్యం వల్ల, ఎక్కువ రీడింగ్ రావడంతో, స్లాబ్ మారడంతో బిల్లు ఎక్కువ అయ్యి ప్రజల పై భారం అదనపు భారం పడుతుందని చెప్పారు.స్మార్టు మీటర్లు సీమ రైతుకు ఉరితాళ్లుగా మారుతున్నాయని సూచించారు.మాట తప్పి మడమ తిప్పిన జగన్ రెడ్డి కి ప్రజలు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్ మోహన్ రెడ్డి  అవగాహనా రాహిత్యం , ఆయన అహంకారం , ఆయన దోపిడి, ఈవాళ ఈ రాష్ట్రంలో విధ్యుత్ సంక్షోబానికి కారణం అని తెలియజేశారు. ముఖ్యమంత్రి భూపత్రాలు, స్కూల్‌ బ్యాగులు, పుస్తకాలపై తన బొమ్మలు వేసుకోవడం కాదని, పెరిగిన కరెంట్‌ బిల్లులపై కూడా తన బొమ్మలు వేసుకునే ధైర్యం ఉందా అని వారు ప్రశ్నిం చారు. రాష్ట్ర ప్రభుత్వాలు బంది పోట్లలా వ్యవహరిస్తున్నాయని, పెరిగిన భారాలతో ప్రజాజీవనం కష్టంగా మారిందన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీని జగన్‌ తుంగలో తొక్కా రని, 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ అని నమ్మించి దగా చేశారని ఆరోపించారు. ఒకపక్క రైతులందరూ కూడా విధ్యుత్ లేక బాధపడుతూ ఉంటే మరోపక్క తాడేపల్లి ప్యాలస్ మాత్రం వెలిగిపోతూ ఉందన్నారు. అసలే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కరువు కాటకాలతో అల్లాడుతుంటే  మూలిగే నక్క పై తాటి కాయ పడ్డ చందంగా, విధ్యుత్ చార్జీలు పెంచడం కరెక్ట్ కాదన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజలను చైతన్య పరిచి ప్రజాగ్రహ ఉద్యమం చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ అసెంబ్లీ కోకన్వినర్ గోవర్ధన్ నాయుడు, కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ మల్లేష్ నాయుడు, దండి మల్లికార్జున, పూన మల్లికార్జున, అరబోలు చంద్రశేఖర్, శంకరయ్య ఆచారి, లక్ష్మణ్ స్వామి, శాంతి, కోటి, రామలింగ, సురేంద్ర, నరేష్, నగేష్, శ్రీనివాస్, నాగ, సురేష్, చైతన్య జంగం, మనోహర్ చౌదరి, శ్రీధర్ గౌడ్, గోరంట్ల, స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author