ఎన్డీఏ కూటమి..గెలిచేది 180 సీట్లే..
1 min readకర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే బాబురావు
కర్నూలు, పల్లెవెలుగు: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి 180 సీట్ల కన్నా గెలువదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు గారు తెలియజేశారు. మంగళవారం ఉదయం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబురావు గారు మాట్లాడుతూ ఎన్డీఏలో 400 సీట్లు గెలుస్తామంటున్న మోడీ గారు ఏ విధంగా గెలుస్తారో తెలియజేయాలని కేవలం గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ విన్నవిస్తుందని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మీకు కేవలం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 140 సీట్ల కన్నా రావని ఇది గుర్తుంచుకోవాలని ఎన్డీఏ కూటమి మొత్తం 180 సీట్లు దాటవని ఈ 9 సంవత్సరాలలో మీరు అత్యధిక మెజార్టీతో గెలిచారని దేశ ప్రజలు 2019లో పూర్తి మెజారిటీ ఇచ్చిన దేశ ప్రజలు బాధలు పడ్డారని నిరుద్యోగులు, ఉద్యోగాలు లేక ప్రజలు పనులు లేక పస్తులు ఉంటున్నారని మీ హయాంలో ప్రాజెక్టులు పరిశ్రమలు స్థాపించారా అని ప్రశ్నించారు. అనంతరం మాజీ మంత్రి మూలింటి మారెప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్రంలో షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుందని వైసీపీ పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్ డిసిసి ఉపాధ్యక్షులు బి బతకన్నా రియాజుద్దీన్ డిసిసి ప్రధాన కార్యదర్శులు షేక్ నవీద్, కె సత్యనారాయణ గుప్త, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎస్ ప్రమీల సేవాదళ్ జిల్లా అధ్యక్షురాలు ఏ సుజాత రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు కొత్తపేట మున్నా సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏ లలిత కాంగ్రెస్ నాయకులు షేక్ మాలిక్ జేమ్స్ మొదలగు వారు పాల్గొన్నారు.