ఎన్.డి.ఆర్.ఎఫ్ అవగాహన కార్యక్రమం
1 min read– ప్రతి పరిశ్రమలో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
– జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఉయ్యాల ఆదిశేషు
పల్లెవెలుగు వెబ్ భీమవరం : రసాయనిక పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయమై మంగళవారం భీమవరం ఇండస్ట్రియల్ పార్క్ లో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా పరిశ్రమల అధికారి ఉయ్యాల ఆదిశేషు తెలిపారు. భీమవరం ఇండస్ట్రియల్ పార్క్ లోనీ సంతోషిమాత ఫీడ్ ఫ్యాక్టరీ, స్వామి ఫీడ్డ్స్, సీసలిలోనీ జయలక్ష్మి సీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కుమార్ ఆగ్రో ఆయిల్స్ పరిశ్రమలను ఎన్టీఆర్ బృందం సందర్శించి రసాయనిక పరిశ్రమలలో ప్రమాదాలను ఎలా నివారించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదం సంభవించిన అనంతరం చేపట్టవలసిన చర్యలపై పూర్తి అవగాహన కార్యక్రమాన్ని ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం చేపట్టడం జరిగింది. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో విధిగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, ప్రమాద సమయంలో లోపల ఉన్న సిబ్బందిని ఎలా తరలించాలి, తదితర విషయాలతో ప్రతి పరిశ్రమంలో ఒక ముందస్తు ప్రణాళిక ను సిద్ధంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగే, పరిశ్రమలు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు ప్రమాద సమయంలో ఎలా ఎదుర్కోవాలో అనే విషయమై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమ శాఖ అధికారి ఉయ్యాల ఆదిశేషు మాట్లాడుతూ జిల్లాలో మూడు అతి ప్రమాదకరమైన పరిశ్రమలు ఉన్నాయని వాటిలో తణుకులోని ఆంధ్ర షుగర్స్, జయలక్ష్మి ఫెర్టిలైజర్స్, వెండ్ర లోని డెల్టా పేపర్ మిల్స్ (ప్రస్తుతం వినియోగంలో లేదు) ఉన్నాయన్నారు. అలాగే ప్రమాద స్థాయిలో ఉన్న 25 ఫ్రాన్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయని వాటిలో అమోనియం గ్యాస్ వినియోగించడం జరుగుతుందన్నారు. ప్రమాదాలను ఎదుర్కోవడంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలిపారు.ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం ఇన్స్పెక్టర్ వై.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎపిఐఐసి జెడ్.ఎం కృష్ణ ప్రసాద్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామ కృష్ణ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి. శ్రీనివాసరావు, ఎన్టీఆర్ బృందం సభ్యులు పాల్గొన్నారు.