NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీర‌వ్ మోదీ మేన‌మామ అదృశ్యం..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: పీఎన్ బీ బ్యాంకు కుంభ‌కోణం కేసులో ప‌రారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అదృశ్యం అయ్యారు. అంటిగ్వా పౌర‌స‌త్వంతో త‌ల‌దాచుకుంటున్న మెహుల్ చోక్సీ నిన్న సాయంత్రం నుంచి క‌న‌ప‌డ‌టంలేద‌ని ఆయ‌న త‌ర‌పు లాయ‌ర్ విజ‌య్ అగ‌ర్వాల్ కోర్టుకు తెలిపారు. రెస్టారెంట్ లో విందు కోసం వెళ్లిన చోక్సీ క‌న‌ప‌డ‌టంలేద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. జాలీ హార్చర్ స‌మీపంలో చోక్సీ వాహ‌నం గుర్తించిన‌ట్టు అంటిగ్వా పోలీసులు తెలిపారు. మెహుల్ చోక్సీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. 2018లో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చాక మెహుల్ చోక్సీ ప‌రార‌య్యారు. మెహుల్ చోక్సీ .. పీఎన్ బీ కేసులో మ‌రో నిందితుడు నీర‌వ్ మోదీకి మేన‌మామ‌.

About Author