నీట్, జేఈఈ స్టూడెంట్ మెంబర్ షిప్ ప్రారంభం !
1 min readపల్లెవెలుగువెబ్ : నీట్, జేఈఈ 2023-24 విద్యార్థుల కోసం కోటా ఎడ్యూగ్రామ్, ఐఐటీ/జేఈఈ-నీట్ ఫోరం సంయుక్తంగా ‘స్టూడెంట్ మెంబర్‌షిప్’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. ఈ మెంబర్‌షిప్ పొందడం ద్వారా విద్యార్థి ఏడాది పొడవునా మెయిల్ ద్వారా కోటా డిజిటల్ మెటీరియల్‌ను పొందవచ్చని కోటా ఎడ్యూగ్రామ్ నిర్వాహకులు తెలిపారు. ప్రతి విద్యార్థికి అవసరమైన నీట్, జేఈఈ, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్, సొల్యూషన్స్, క్విక్ రివిజన్, ఫార్ములా బుక్‌లెట్స్, గ్రాండ్ టెస్ట్, క్వశ్చన్ బ్యాంక్, చాప్టర్ వారీగా గ్రాండ్ టెస్ట్, తరచూ అడిగే ప్రశ్నలను పొందవచ్చన్నారు. ఆసక్తిగల విద్యార్థులు www.edugram360.com వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయి, ఆన్‌లైన్ మెంబర్‌షి్‌పను పొందవచ్చని తెలిపారు.