PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీలను నిర్లక్ష్యం చేస్తే సహించం- బోను దుర్గా నరేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: బీసీలను ఏ రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేసినా వారి ఆగ్రహావేశాలు చవి చూడవలసి వస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గ నరేష్ హెచ్చరించారు.బీసీలకు జనాభా లెక్కల ప్రకారం అన్నీ రంగాల్లో రావలసిన సీట్లు, రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన కోరారు.. తమ న్యాయ పరమైన కోర్కెలు నెరవేరే వరకు ఢిల్లీలో నిరసనలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గ నరేష్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సంధర్బంగా అయన మాట్లడుతూ బీసీ ల జనగణన జరగాలని ఢిల్లీ లో ఈ నెల మూడు, నాలుగు తేదీలలో నిరసనలకు పిలుపు ఇచ్చినట్లు చెప్పారు.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అట్. కృష్ణయ్య పిలుపు మేరకు నల్గోవ తేదీన పార్లమెంట్ ముట్టడిస్తామని అన్నారు..బీసీ ల కులగణన చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కులగణన చేయటం లేదని ప్రశ్నంచారు.. బీసీ ల జనగణన చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు.. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కేంద్రాన్ని అయన డిమాండ్ చేశారు.. బీసీల మీద చిత్తశుద్ది తో కృష్ణయ్య కి రాజ్య సభ సీటు ఇచ్చి చట్టసభలలో పోరాడండి అని సహకరించిన నాయకుడు సీఎం జగన్ అని గుర్తు చేశారు..న్యాయబద్దంగా బీసీలకు రావలసిన సీట్లు కేటాయించాలని అయన కోరారు.. రాజకీయ పార్టీలు బీసీల ఆగ్రహావేశాలకు గురికావొద్ధని అయన హెచ్చరించారు… బీసీలకు అండగా నిలిచిన పార్టీలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని అయన స్పష్టం చేశారు.. అదేవిధంగా తాను బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నియమితుడు అవుతున్న సమాచారం తెలిసి కొంతమంది అల్లర చిల్లర గా వ్యవహరిస్తూ సంఘంలో తనకు సహకరిస్తున్న వారినీ వేదిస్తున్నట్లు చెప్పారు.. అలాంటి వారి పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.. సంఘం మహిళలను సోషల్ మీడియాలో ఎవరు వేధించిన గట్టి చర్యలు ఉంటాయని హెచ్చరించారు…. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ మెండే జ్యోతి, ఎన్. టి.ఆర్ జిల్లా అద్యక్షులు వరప్రకాష్, యువజన విభాగం నగర అదక్షులు కిరణ్, ప్రచార కమిటీ సభ్యులు దినేష్, నగర మహిళ అధ్యక్షురాలు యస్.కే. నాగుర్ బి,యస్ కే. తాహిరా,జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About Author