ఉద్యోగులపై నిర్లక్ష్యం.. అందుకే ఉద్యమం..!
1 min readఅందరి మద్దతుతోనే ఉద్యమం కొనసాగుతోంది..
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి..
నూతన కలెక్టర్ జి. సృజనకు వినతిపత్రం అందజేసిన ఏపీ జేఏసీ జిల్లా నాయకులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు:ఉద్యోగల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఉద్యమానికి దారి తీసిందని, ఉద్యోగుల సంపూర్ణ మద్దతుతోనే ఏపీజేఏసీ ఆధ్వర్యంలో నిరసన, మలిదశ ఉద్యమం చేపడుతున్నామని ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి కలెక్టర్ జి. సృజనకు విన్నవించారు. సోమవారం నూతనంగా బాధ్యతలుగా స్వీకరించిన జిల్లా కలెక్టర్ జి. సృజనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ను ఉద్యోగులు కలిశారు. మలిదశ ఉద్యమంలో భాగంగా నల్లమాస్కులు ధరించి నిరసన తెలుపుతూ… జిల్లా సర్వోన్నత అధికారి జి. సృజనకు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి, జనరలి సెక్రటరి కెవై కృష్ణ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం లో ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్లనే ఈ ఉద్యమం కొనసాగిస్తున్నామన్నారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న నల్లబ్యాడ్జీల నిరసన కార్యక్రమాలను ఈనెల 29 వరకు కొనసాగిస్తామన్నారు. ఈరోజు జరిగిన కార్యక్రమం లో ఏపిజెఏసి అనుబంద సంఘల జిల్లా అధ్యక్ష,ఫ్రధానకార్యదర్శులు మరియు అధికసంఖ్య లో ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
రేపు… ఫోన్డౌన్…
ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన మలిదశ ఉద్యమంలో భాగంగా మంగళవారం ఫోన్ డౌన్ ప్రొగ్రామ్ చేపట్టాలని పిలుపునిచ్చారు కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి. ఉద్యోగులందరూ అధికారిక పనుల కోసం సెల్ ఫోన్‌లను ఒక రోజు ఉపయోగించవద్దని కోరారు. ఉద్యోగులు ఉద్యమ షెడ్యూల్‌ను పాటించాలని సూచించారు. ఈ నెల 29 వరకు చేపట్టే మలి దశ ఉద్యమంలో ప్రతి ఉద్యోగి మద్దతు తెలుపుతూ…నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని, అప్పుడే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించుకోవచ్చన్నారు.