నిద్ర నిర్లక్ష్యం చేస్తే గుండెకు ముప్పు !
1 min readపల్లెవెలుగువెబ్: నిద్ర మన జీవనంలో ముఖ్యమైన భాగం. ఈ సమయంలోనే మన శరీరం తిరిగి పునరుజ్జీవాన్ని సంతరించుకుంటుంది. కళ్లు, కాలేయం తదితర కొన్ని వ్యవస్థలకు విశ్రాంతి లభిస్తుంది. కానీ, నేటి ఆధునిక జీవనంలో నిద్ర తగినంత ఉండడం లేదు. కంటి నిండా (8 గంటలు) నిద్ర లేని వారే ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ, ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి కనీసం 6-8 గంటలు నిద్ర అవసరం. అది కూడా నాణ్యమైన నిద్ర అని తెలుసుకోవాలి. నిద్ర తగినంత లేకపోతే ఒత్తిడి పెరిగిపోతుంది. అలసట, నీరసం వస్తాయి. ఏకాగ్రత లోపిస్తుంది. మధుమేహం పలకరిస్తుంది. రక్తపోటుకు దారితీస్తుంది. చివరిగా గుండె చిన్నబోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక స్మార్ట్ ఫోన్ పై గంటల కొద్దీ సమయాన్ని వృధా చేయకుండా సకాలంలో నిద్రకు ఉపక్రమించి, రోజువారీగా 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.