అధికారుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణా లోపం…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పౌరసరఫరాల శాఖ నేడు నిర్లక్ష్యానికి గురికాబడింది.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక మార్పులు మెరుగు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ఇంటి వద్దకే బియ్యం సరఫరాను చేయబడిందిఅయితే దీనిని తూట్లు పొడిచే విధంగా డీలర్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణా లోపం వల్లప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. ఇంతకుముందు కూడా ఇలాంటి సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. అధికారుల ఉదాసీనత డీలర్ల నిరీక్షణ వల్ల నేడు కూడా ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందిమండల కేంద్రమైన హొళగుందలో డీలర్ షాప్ నంబర్ 31 నందు ఈ సమస్య తలెత్తడం 6 వార్డు ప్రజలు తీవ్ర ఆవేదనతో ధర్నా నిర్వహించడం జరిగింది మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ ఎదురు నినాదాలు చేయడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వీడాలి డీలర్లను వెంటనే సస్పెండ్ చేయాలి బియ్యం వెంటనే పంపిణీ చేయాలి అనే నినాదంతో ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఎమ్మార్వో హుస్సేన్ సార్ మరియు ఆర్ఐ దినోద్ సార్ ధర్నా నిర్వహించిన ప్రజలకు 15 తేదీల్లో బియ్యం పంపిణీ చేయిస్తామని హామీ ఇచ్చారు ప్రజలు ఇలాంటి సంఘటనలను శాశ్వత పరిష్కారం చేయాలని వారిని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పౌరసరఫరాల శాఖ ఇంటి వద్దకే ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. మండల కేంద్రమైన హొళగుదలొ 6 వార్డు ప్రజలకు గత నాలుగు నెలలుగా బియ్యం సరఫరా సరిగా జరగడం లేదు ఈ సమస్యపై ఇంతకుముందే అధికారులను సంప్రదించగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అధికారుల పర్యవేక్షణ లోపం ఉదాసీనత కారణంగా నేడు అదే సమస్య పునరావృత్తం అవుతుంది దీని గురించి అధికారులైన వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలి, ఈ ధర్నాలో హమీద్, సుభాన్, అబ్దుల్ రహిమాన్, మంగయ్య, టైలర్ రహిమాన్, ఎస్ ఎం డి షఫీ,6 వార్డ్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.