రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం.. బాధితులతో బైఠాయించిన సిపిఎం నాయకులు
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: దేవనకొండ మండలంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య ధోరణి పై సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్, మండల కమిటీ సభ్యులు అశోక్, మా మహబూబ్ బాషా లు తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం బాధితులతో బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెర్నేకల్ గ్రామానికి చెందిన మాభాష అనే రైతుకు381/1 లో 7 ఎకరాలు వ్యవసాయ పొలము లో 27 సెంట్లు హంద్రీనీవా కాలువ కింద పోయిందని, అయితే మిగిలిన 6 ఎకరాల 63 సెంట్లు పట్టాదారు పాసు బుక్కులో ఎక్కించాల్సి ఉండగా రీ సర్వే పేరుతో 6 ఎకరాల 30 సెంట్లు మాత్రమే రెవెన్యూ రికార్డులో ఉందన్నారు. ఇంకా 33 సెంట్లు రావాల్సి ఉందని, 33 సెంట్లు మరో రైతుకు ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా 382 – ఏ సర్వే నెంబర్ లో 1.50 ఎకరాలకు గాను 50 సెంట్లు హంద్రీనీవా కాలువ లోకి వెళ్లిందని 50 సెంట్లు పరిహారం ఇవ్వకుండానే ఆన్లైన్ రికార్డులో తొలగించారని ఇది రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమని విమర్శించారు. రెవిన్యూ కార్యాలయం చుట్టూ పలుమార్లు ప్రదక్షణలు చేసినప్పటికీ సమస్యను పరిష్కరించ లేదన్నారు. సర్వేయర్, విఆర్ఓ నిర్లక్ష్యంతోనే రైతుకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. కార్యాలయంలో బైఠాయించిన సిపిఎం నాయకులతో జూనియర్ మల్లికార్జున కలుగజేసుకొని సమస్యను మంగళవారం పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు.