NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

27న మరోసారి చర్చలు

1 min read

పల్లెవెలుగువెబ్ : పీఆర్సీ పై ఈనెల 27న మరోసారి చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంత్రుల కమిటీ ఉద్యోగుల కోసం ఎదురుచూసిందన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ఆలస్యంగా వచ్చినా వేచి చూశామని ఆయన పేర్కొన్నారు. జీవోలు నిలుపుదల చేయాలని ఉద్యోగసంఘాలు కోరాయని ఆయన తెలిపారు. జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదీ అడక్కుండానే సీఎం అన్నీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఇంతకాలం చేసిన ప్రక్రియను తిరగతోడడం సరికాదనే ప్రభుత్వం అప్పీల్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

      

About Author