నియోకోవ్.. సోకితే ముగ్గురిలో ఒకరు మృతి !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన వైరస్ కొత్త వేరియంట్లు రోజుకొకటి పుట్టుకొస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకిత్తిస్తుండగా.. దక్షిణాఫ్రికాలో మరో కొత్త రకం వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటు మరణాల రేటు కూడ అధికంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు వూహాన్ శాస్త్ర్రవేత్తలు హెచ్చరికలు చేయడం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో గబ్బిలాల్లో ఈ వైరస్ బయటపడింది. ఇది కూడ కరోన వైరసేనని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు సోకుతున్న వైరస్ గానే గుర్తించారు.