నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి ర్యాలీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నేతాజీ సుభాష్ చంద్రబోస్ కమిటీ ఆధ్వర్యంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కూడలి వద్ద నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి ర్యాలీ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన విద్యార్థులు భారత స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగాన నిలబడి రాజీలేని పోరాటపంథాని అనుసరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా మొదటగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడలి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత కంట్రోల్ రూమ్ సర్కిల్ వద్ద ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకులుగా విచ్చేసినటువంటి శ్రీ పత్తి ఓబులయ్య గారు, టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటం ముందు పుష్పాలను ఉంచి. నేడు విద్యార్థులు యువతీ యువకులు ఇటువంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని, వారి ఆశయ సాధనకై కృషి చేయాలని, అన్యాయాన్ని వ్యతిరేకించేటువంటి మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలనే సందేశం ఇచ్చారు… తదుపరి సోషల్ టీచర్ శ్రీ విజయ ప్రసాద్ గారు మాట్లాడుతూ “మీరు రక్తాన్ని ఇవ్వండి నేను స్వాతంత్రాన్ని ఇస్తాను” అనేటువంటి నినాదంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజీ లేకుండా స్వాతంత్రం కోసం పోరాడారని అటువంటి వ్యక్తి మనకు ఆదర్శమని వివరించారు. చివరగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కమిటీ సభ్యులు తేజోవతి గారు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాన్ని కొనసాగించడం అంటే ప్రతి అంశంలోనూ రాజీ లేనటువంటి పోరాటాన్ని చేయాలని. అన్యాయాన్ని, అవినీతిని ప్రశ్నించే నైజాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని తద్వారా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకై మనం కృషి చేయాలని పిలుపునిచ్చారు… ఈ కార్యక్రమంలో AIDSO నాయకులు సిటీ సెక్రటరీ మల్లేష్, అఖిల్, సక్రప్ప AIMSS సిటీ సెక్రటరీ ప్రియాంక, సంధ్య, సుజాత BSS సిటీ ఇన్చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, ఖాదర్ నాగన్న మరియు విద్యార్థులు జితేంద్ర, రాజు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.