NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజీలేని స్వాతంత్ర పోరాటాన్ని నడిపిన వీరుడు నేతాజీ

1 min read

– రాజీలేని స్వాతంత్ర పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని సమున్నతంగా పాటించండి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్వాతంత్రోద్యమంలో అగ్రభాగాన నిలబడి రాజీలేని స్వాతంత్ర పోరాటాన్ని నడిపిన వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. జనవరి 1 నుంచి 23వ తేదీ వరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి ముగింపు కార్యక్రమాలను కర్నూలు నగరంలో అనేక కళాశాలలు, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ లో నేతాజీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆయన యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని, ఇటువంటి గొప్ప వ్యక్తుల యొక్క వారసులుగా నేటి సమాజంలో ఉన్న అన్ని సమస్యలకు వ్యతిరేకంగా రాజీ లేనటువంటి పోరాటాన్ని కొనసాగించాలని నేతాజీ కలలుగన్న సమాజం సాకారం చేయడం కోసం విద్యార్థులు యువతీ యువకులు ముందుకు రావాలని పిలుపునిస్తూ అందులో భాగంగా రేపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి కార్యక్రమాన్ని కంట్రోల్ రూమ్, కోట్ల విజయభాస్కర్ సర్కిల్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రం పటానికి పూలమాలలు వేసే కార్యక్రమం చేపట్టి కంట్రోల్ రూమ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీని చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.

About Author