NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేతాజీ శౌర్యం.. త్యాగనిరతి ఆదర్శనీయం

1 min read

రాయలసీమ శకుంతల
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: యువత ప్రతి ఒక్కరూ సేవా త్యాగం సమర్పయామి అనే సిద్ధాంతాన్నిఆలవరుచుకొని నేటి సమాజంలో వారి సేవలు అందించి దేశం గర్వించేలా పాటుపడాలని రాయలసీమ మహిళ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి వైయస్సార్ నాయకురాలు, ex ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ రాయలసీమ శకుంతల యువతకు పిలుపునిచ్చారు ఈ మేరకు సోమవారం కర్నూలు అర్బన్ పరిధిలోని అశోక్ నగర్ లో గలపట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకన జరిపారు. ఈ సందర్బంగా నేతాజి చిత్రపటానికి పూలమాలలు వేసిశారు . అనంతరం రాయలసీమ శకుంతల మాట్లాడుతూ సిద్ధాంతం కోసం ఒకరు తమ ప్రాణాలను కోల్పోవచ్చు. అయితే, ఆ సిద్ధాంతం, వారి మరణం తర్వాత వేలాది మందిలో స్ఫూర్తిని నింపుతుంది అన్నారు. నిరుపమానమైన నేతాజీ శౌర్యం, సంకల్పం, త్యాగనిరతి ఆదర్శనీయం. బ్రిటీష్ కబంధ హస్తాల నుంచి మాతృభూమిని విముక్తం చేసే దిశగా భారత స్వరాజ్య సంగ్రామంలో నేతాజీ పోషించిన పాత్రకు యావత్ భారత జాతి వారికి రుణపడిఉంటుంది అన్నారు.ఈ కార్యక్రమంలో వసతి గృహ మేనేజర్ , కేర్ టే కర్ లతశ్రీ, నిరాశ్రయ మహిళలు ఉన్నారు.

About Author