PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంగ్లీ పాట‌పై నెటిజ‌న్ల ఆగ్రహం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలంగాణ బోనాల ఉత్సవం సంద‌ర్భంగా సింగ‌ర్ మంగ్లీ పాడిన పాటపై ప‌లువురు అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్నారు. ‘చెట్టు కింద కూసున్నావ‌మ్మా’ అంటూ సాగే బోనాల పాట‌ని సింగ్ మంగ్లీ పాడి, ఆడి.. యూట్యూబ్ లో విడుద‌ల చేసింది. ఈ పాట ఎంద‌రో ప్రేక్షుకుల్ని అల‌రిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు విమ‌ర్శలు చేస్తున్నారు. అమ్మవారిపై వాడిన కొన్ని ప‌దాలు ఇందుకు కార‌ణ‌మ‌య్యాయి. ‘బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక‌. అలాంటి అమ్మవారిని ఇలా తిడ‌తారా ?` అంటూ ప్రశ్నిస్తున్నారు. పాట‌లో అమ్మవారిని తిడుతున్నట్టు ఉంద‌ని వీక్షకులు విమ‌ర్శిస్తున్నారు. భక్తి పేరుతో దేవుళ్లను అప‌హాస్యం చేయొద్దంటూ నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

About Author