PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా ఎన్ . నాగరాజు  పదవీ బాధ్యతలు

1 min read

జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ని మర్యాదపూర్వకరంగా కలిసిన … అడిషనల్ ఎస్పీ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నూతన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా శ ఎన్. నాగరాజు  బాధ్యతలు చేపట్టారు.బాధ్యతలు చేపట్టిన నూతన అడిషనల్ ఎస్పీ  జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్  ఐపియస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్. నాగరాజు   గురించి ..స్వస్థలం తిరుపతి.1989 లో ఎస్ ఐ హోదాలో పోలీస్ శాఖలో చేరారు . ఎస్సై గా…ఎక్కువ కాలం కడప జిల్లాల లోని పలు ప్రాంతాల్లో  పని చేశారు. 2000 సంవత్సరంలో  సీఐగా పదోన్నతి పొందారు. సిఐగా …కడప , ప్రకాశం జిల్లాలో  పని చేశారు.2011 లో  డీఎస్పీగా పదోన్నతి పొందారు.డీఎస్పీగా… సిఐడి హైదరాబాద్, తాడి పత్రి, ఎసిబి వైయస్సార్ కడప, ప్రకాశం జిల్లా దర్శి , జమ్ముల మడుగు లో పనిచేశారు.ప్రస్తుతం వైయస్సార్ కడప జిల్లా, జమ్ములమడుగులో డిఎస్పీ గా పని చేస్తూ ఇటీవల   అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి   పై బదిలీ అయి కర్నూలు జిల్లా కు  అడిషనల్ ఎస్పీగా  వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అడిషనల్ ఎస్పీని  పలువురు పోలీసు అధికారులు ,డిపిఓ కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.

About Author