ఉభయ తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు
1 min readపల్లెవెలుగువెబ్, ఢిల్లి: ఉభయ తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను కేంద్రం ప్రభుత్వం నియమించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నియమితులయ్యారు. దేశంలోని అయిదు రాష్ట్రాలకు కేంద్రం నూతన ఛీఫ్జస్టిస్లను నియమించింది. అలాగే 17మంది హైకోర్టు న్యాయమూర్తులకు సైతం స్థానచలనం కల్పించింది. ఆయా బదిలీల్లో భాగంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుప్కుమార్గోస్వామి ఛత్తీస్‌గడ్‌కు బదిలీ అయ్యారు. సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యలోని కొలీజియం సిఫారసు మేరక కేంద్రం ఆయా హైకోర్టులకు సీజేలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.