PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్… పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి

1 min read

– కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో న్యూ  డయాగ్నస్టిక్ వైద్య సేవల

– ఆసుపత్రి సూపరింటెండెంట్,డా.V.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ..

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని వివిధ విభాగాల ల్యాబ్ HODsలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రి న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ లో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ గారితో రౌండ్స్ నిర్వహించి అనంతరం ఆసుపత్రిలోని నూతన డయాగ్నస్టిక్ బ్లాక్ వల్ల ఒకేచోట రక్త పరీక్షలు, సిటీ, స్కానింగ్, ఎక్స్రే ఇతర పరీక్షలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.ఆసుపత్రిలోని పలు విభాగాల ల్యాబ్ హెచ్ ఓ డి స్ అయిన పెథాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ మరియు రేడియాలజీ విభాగాల HODsలతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని నూతన డయాగ్నస్టిక్ బ్లాక్ లో ఉన్న భవనాలని ఎలా కేటాయించాలి అనే దానిపై చర్చించినట్లు తెలిపారు.వివిధ విభాగాల HODs యొక్క అభిప్రాయాలు మరియు వారి యొక్క సూచనలను పరిగణలోకి తీసుకొని త్వరలో ల్యాబ్ యొక్క  కార్యాచరణను ప్రకటిస్తానని తెలియజేశారు.ఆసుపత్రిలో న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ ద్వారా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి  ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా. ప్రభాకర్ రెడ్డి, CSRMO, డా.వెంకటేశ్వరరావు, RMO డా.వెంకటరమణ, ల్యాబ్ హెచ్వోడీస్, డా.రాధారాణి, డా.రేణుక, డా.పద్మ విజయ్ శ్రీ, డా.రమణ బాబు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, తదితరులు  పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, గారు తెలిపారు.

About Author