NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన పాలకమండలి సమావేశం

1 min read

– ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా.. ఆలయ చైర్మన్ ఐసాని సునీల్ కుమార్ రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ గడివేముల : మండల పరిధిలోని గడిగరెవుల గ్రామ సమీపాన వెలసిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానానికి శనివారం నాడు నూతన పాలకమండలి కొలువైంది ఆలయ చైర్మన్ గా గడిగరేవుల గ్రామానికి చెందిన ఐసాని సునీల్ కుమార్ రెడ్డి .. ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అధికారి ఈవో చంద్రశేఖర్ రెడ్డి.. జెడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి. ఎంపీడీవో విజయసింహారెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించారు మహాశివరాత్రి 2023 సంబంధించిన పారిశుద్ధ్యం వచ్చే భక్తులకు తాగునీరు పార్కింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు స్వామి వారి కళ్యాణం రథోత్సవం ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్య తీర్మానాలు చేశారు.తదుపరి ఎంపీడీవో జిల్లాపరిషత్ మెంబెర్ ఆర్ బీ.చంద్రశేఖర్ రెడ్డి మరియు పరిసర గ్రామాల ప్రజలు,పెద్దలు భక్తుల సమక్షంలో సమావేశం నిర్వహించారు, నంద్యాల డీవిజన్ తనికీ అధికారి కిరణ్ కుమార్ రెడ్డి,ఛైర్మెన్ సునీల్ కుమార్ రెడ్డి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు వై.సురేంద్రనాథ్ రెడ్డి,పి. పరమేశ్వర రెడ్డి,యన్. శివుడు,సి. శ్రీనివాసులు, యస్.శివ శంకరమ్మ,ఎ. కుమారియస్.శంకరమ్మ భాయ్ఎ. సులోచనదేవస్థానం అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.

About Author