ప్రభుత్వ ఉపాధ్యాయులకు కొత్త గైడ్ లైన్స్ !
1 min readపల్లెవెలుగువెబ్ : రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల సర్దుబాటుపై పాఠశాల విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిబి.రాజశేఖర్ జీవో 117ను జారీచేశారు. జాతీయ విద్యాహక్కుచట్టం, నూతన జాతీయ విద్యావిధానాలను అనుసరించి పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో భాగంగా టీచర్ల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ ఈచర్యలు చేపట్టింది. అంగన్‌వాడీ సెంటర్లు, నాన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ స్కూళ్లను పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్, ఫౌండేషనల్ స్కూల్, ఫౌండేషనల్ స్కూల్ ప్లస్, ప్రీ హైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ పాఠశాలలుగా ఇవి పునర్వ్యవస్థీకరణ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి తగ్గ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అవసరమైన మేర సెకండరీ గ్రేడ్ టీచర్లను, సబ్జెక్టు టీచర్లను సమకూర్చేలా ప్రభుత్వం ఈ సర్దుబాటు ప్రక్రియను చేపట్టింది.