నూతనంగా కర్నూల్ జిల్లా ఉమెన్ వింగ్ ఎన్నిక
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నూతనముగా ఎన్నికైన కర్నూల్ జిల్లా విమెన్ వింగ్ సభ్యులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ G. సృజన, IASని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించడం జరిగింది. ఈ సందర్భముగా ఎన్నికైన సభ్యులందరినీ మేడం శుభాకాంక్షలు తెలియజేసి అభినందించడం జరిగినది. కార్యక్రమములో APJAC అమరావతి చైర్మన్ గిరి కుమార్ రెడ్డి చైర్మన్ మరియు కృష్ణ సెక్రటరీ మరియు వెంకటరాజు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, APRSA పాల్గొన్నారు. కలెక్టర్ ని కలిసిన వారిలో శ్రీమతి మల్లేశ్వరమ్మ, విమెన్ వింగ్ జిల్లా చైర్మన్, శ్రీమతి జ్యోష్న కో చైర్మన్, శ్రీమతి పద్మావతి, కో చైర్మన్, శ్రీమతి రేణుక, సెక్రటరీ లు ఉన్నారు.