NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బెంగుళూరుకు కొత్తపేరు.. ఏంటో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరుకు కొత్త పేరు పెట్టారు. మ‌హీంద్ర కంపెనీ అధినేత ఆనంద్ మ‌హింద్రా బెంగ‌ళూరుకు కొత్త పేరు సూచించాల‌ని నెటిజ‌న్లను కోరారు. దీంతో ర‌క‌ర‌కాల పేర్లతో నెటిజ‌న్లు పోటీప‌డ్డారు. న‌గ‌రానికి చెందిన శ్రీనివాస‌రెడ్డి అనే వ్యక్తి టెక్ హ‌ళ్లిగా పేరు పెట్టారు. టెక్ హళ్లి అంటే సాంకేతిక గ్రామం అని అర్థం. ఈ పేరు ప‌ట్ల ఆనంద్ మ‌హీంద్ర, న్యాయ‌నిర్ణేత‌గా వ్యవ‌హ‌రించిన ఇన్ఫోసిస్ వ్యవ‌స్థాప‌కుల్లో ఒక‌రైన నంద‌న్ నీలేక‌ని సుముఖ‌త వ్యక్తం చేశారు. ఈ పేరు పెట్టిన వ్యక్తికి ఫినిన్ ఫెరీన హెచ్ 2 స్పీడ్ కారును బ‌హుమ‌తిగా ఇవ్వనున్నారు. అందుకోసం అత‌ని చిరునామ పంపించాలని ఆనంద్ మ‌హీంద్ర కోరారు.

About Author