ఏపీలో కొత్తపార్టీ ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలోని వివిధ సంఘాలతో విజయవాడలో వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం దాదాపు రెండు గంటలపాటు సాగింది. త్వరలో కొత్త పార్టీ ప్రకటించే ఆలోచనలో బ్రదర్ అనిల్ ఉన్నాడని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జగన్, వైసీపీ వ్యతిరేక వర్గాలతో బ్రదర్ అనిల్ మంతనాలు జరిపారు. ఇటీవల బ్రదర్ అనిల్ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యారు. ఇప్పుడు వివిధ సంఘాలతో భేటీ అవ్వడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.