NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త్వ‌ర‌లో కొత్త రాజ‌కీయ పార్టీ !

1 min read

పల్లెవెలుగువెబ్ : త్వరలో రాజకీయ పార్టీ పెడతానని చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న అన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న దొంగల సంఖ్య 7200 అని, రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్న ఆ 7200 మంది వెలమ దొరల భరతం పడతానని ఆయన హెచ్చరించారు. తాను ఏర్పాటు చేసిన ఈ టీం బీజేపీ కన్నా లక్ష రెట్లు నయం అని అన్నారు. ఇక బీజేపీ కార్యాలయంలో నేను ఎప్పటికీ అడుగుపెట్టనని చెప్పారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, న్యాయం అందక నిరుపేదలు నానా అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నర తరువాత హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో పది లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి, గూండాగిరి రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. తమ టీం ఎవరికీ భయపడదని, ఎన్ని అవాంతరాలు వచ్చినా న్యాయం కోసం నిలబడతామని ధీమా వ్యక్తం చేశారు.

                                   

About Author