PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన రైల్వే నూతన భారతదేశం కోసం..

1 min read

భారతీయ రైల్వే మౌళిక సదుపాయాల కల్పనలో ప్రముఖ పాత్ర

అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 3.58 కోట్ల రూపాయలలో మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ ఎంపిక

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : నూతన రైల్వే,నూతన భారతదేశం కోసం అనే నినాదంతో రైల్వే నందు మౌళిక సదుపాయాల కల్పనలో భారీ పురోగతి దిశగా పయనిస్తూ, రికార్డు స్థాయిలో విధ్యుదీకరణ మరియు ఆధునిక రైలు ప్రయాణ సౌకర్యాల  అభివృద్ధే అమృత్ భారత్ స్కీం  ముఖ్య ఉద్దేశమని కోసిగి వైకాపా మండల ఇంచార్జీ  పి మురళీ మోహన్ రెడ్డి  అన్నారు. సోమవారం దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ  చేతుల మీదుగా దేశంలోని 554 రైల్వే స్టేషన్ల పునరాభివృధ్ధికి మరియు 1500 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు/అండర్ పాసుల శంకుస్థాపన/ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం వంటి కార్యక్రమాల్లో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ క్రింద 3.58కోట్ల రూపాయలతో చేపట్టనున్న మంత్రాలయం రోడ్ (తుంగభద్ర) అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి  అదేశాల మేరకు కోసిగి మండల ఇంచార్జీ శ్రీ పి మురళీ మోహన్ రెడ్డి  పాల్గొన్నారు.ముందుగా మురళీ రెడ్డి  అతిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన అనంతరం శిలాఫలకంను ఆవిష్కరించారు.అనంతరం అమృత్ భారత్ క్రింద నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం జేశారు.ఈకార్యక్రమంలో మంత్రాలయం సిఐ ఏరిషావలి, మధవరం యస్ఐ క్రిష్ణమూర్తి, బిజేపి నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి,రైల్వే అధికారులు విష్ణు వర్ధన్ రెడ్డి,వంశీక్,అక్షయ్ కుమార్,నాగార్జున,సాజిద్, సునీల్ కుమార్,సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author